Site icon NTV Telugu

Manchu Vishnu : నా భార్య నన్ను రెండో పెళ్లి చేసుకోమంది..

Bollywood,abhishek Bachchan,aishwarya (5)

Bollywood,abhishek Bachchan,aishwarya (5)

మంచు విష్ణు .. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్‌లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ప్రజంట్ ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, వచ్చే నెల 25న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ఇప్పటి నుండే ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆయన తన భార్య, పిల్లల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

Also Read: Salman Khan : రష్మిక‌కు లేని బాధ మీకెందుకు..

మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఉన్నంతసేపు నేను ఈ లోకాన్నే మర్చిపోతుంటాను. నా భార్య విరానికా ని ఇంకా పిల్లలు కావాలని అడిగాను, అప్పుడు ఆమె నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది’ అంటూ మంచు విష్ణు తెలిపారు. దీంతో ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆయన పిల్లలు కూడా ‘కన్నప్ప’ చిత్రం‌లో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version