Site icon NTV Telugu

Manchu Vishnu : మంచు విష్ణు’ని హర్ట్ చేసిన శ్రీవిష్ణు

Manchu Vishnu

Manchu Vishnu

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పుడల్లా అవి విజయం సాధించకపోవడంతో, తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ యాంగిల్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన #సింగిల్ అనే సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో ఎంతోమంది హీరోల సినిమాలను, ఆయా హీరోల డైలాగ్‌లను స్పూఫ్ చేసినట్లు కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా, మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలోని “శివయ్య” అనే డైలాగ్‌ను కూడా స్పూఫ్ చేశారు. అలాగే, ట్రైలర్ చివరిలో “మంచు కురిసిపోతారు” అనే డైలాగ్‌ను కూడా వాడారు.

Nani : సల్మాన్ ఖాన్ పై నాని సంచలన కామెంట్స్

అయితే, ఇది తన ఇంటిపేరును ఉద్దేశించి కట్ చేసిన డైలాగ్ అని, అలాగే “శివయ్య” అనే డైలాగ్‌ను వాడటం కూడా సరికాదని మంచు విష్ణు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన తీవ్రంగా హర్ట్ అయినట్లు చెబుతున్నారు. వెంటనే ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తారా, లేక అల్లు అరవింద్ దృష్టికి నేరుగా తీసుకెళ్లి అభ్యంతరం వ్యక్తం చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. గా సరిచేయబడింది.

Exit mobile version