Site icon NTV Telugu

Kannappa: ‘కన్నప్ప’కి మంచు మనోజ్ విషెస్.. మంచు విష్ణుని మాత్రం?

Manchu Manoj Vs Manchu Vishnu

Manchu Manoj Vs Manchu Vishnu

మంచు కుటుంబంలో మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య ఏర్పడిన వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ల క్రితం ఈ వివాదాల కారణంగా ఈ కుటుంబం రోజూ వార్తల్లో నిలిచేది. అయితే, రేపు మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా విడుదల కానుండగా, ఆ సినిమాకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాకు పనిచేసిన అందరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, మంచు విష్ణుని మాత్రం తెలివిగా మరచిపోయారు.

Also Read:Kuberaa : కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్..

ముందుగా టీమ్‌కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన మనోజ్, “నా తండ్రి మోహన్ బాబు, అలాగే కన్నప్ప కోసం సంవత్సరాల తరబడి తమ ప్రేమను, కష్టాన్ని వెచ్చించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే, మా చిన్నారులు అరియానా, వివియానా, అవ్రం బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వారిని చూడడానికి నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..

తనికెళ్ళ భరణి గారి జీవితకాల కల రేపు నిజం కాబోతోంది. ఇది చాలా ఆనందం కలిగిస్తోంది. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా, అలాగే ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ స్క్రీన్‌పై చేసే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నాను. శివుడు ఈ జర్నీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను,” అని పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడి పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్ట్ మొత్తం మీద ఎక్కడా మంచు విష్ణు పేరు లేదా ఫోటో లేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు మనోజ్.

Exit mobile version