Site icon NTV Telugu

Manchu Manoj : తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. తండ్రి చనిపోతే నారా రోహిత్ అలా చేశాడు!

manchu manoj

manchu manoj

మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు నుంచి మీడియాతో ముచ్చటించిన క్రమంలో, భైరవం సినిమా షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొదట్లో ఆ సంఘటనల వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నానని అన్నారు. కానీ, ఆ విషయంలో తన స్నేహితుడు నారా రోహిత్‌ను చూసి తాను ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు.

Also Read: Vishal : నా జీవిత భాగస్వామి దొరికింది..త్వరలో గుడ్ న్యూస్ చెప్తా..

నారా రోహిత్ తండ్రి చనిపోయిన రెండు రోజులు ఇంట్లోనే ఉన్నారని, మూడో రోజు సెట్‌కు వచ్చారని, నిర్మాతకు నష్టం కలగకూడదని వెంటనే బయటకు వచ్చి షూటింగ్‌కు హాజరయ్యారని ఆయన అన్నారు. అప్పుడే తాను, “తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే, ఇకమీదట నేను కూడా ఏదైనా వ్యక్తిగత విషయాలు ఉంటే, షూటింగ్ తర్వాత చూసుకుంటాను” అనుకుని, షూటింగ్‌ను పూర్తి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను నారా రోహిత్‌ను చూసి ప్రేరణ పొందినట్లు ఈ సందర్భంగా మంచు మనోజ్ తెలిపారు.

Exit mobile version