Manchu Manoj : సంగీత ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తోన్న మంచు మనోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణంలో భాగంగా సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఓ ఎమోషనల్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్షణ నటుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మనోజ్. చెల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. బిందాస్, కరెంట్ తీగ, పోటుగాడు వంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తోపాటు ప్రయోగ్రాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సినిమాల్లో తన అభిరుచిని నటనలోనే కాకుండా సొంతంగా స్టంట్స్ కంపోజ్ చేయటం, సెట్స్ రూపకల్పనలో ఇన్‌వాల్వ్‌కావటం, గుర్తుండి పోయే పాత్రను రూపొందించటంలో ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.
Also Read : Mollywood Heroines : పెన్షన్ తీసుకునే వయసొస్తున్నపెళ్ళికి నో చెప్తున్న కేరళ కుట్టీలు..
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
గతంలో ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజరపరిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలో ‘పిస్తా పిస్తా.. ’ పాటతో పాటు ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డా.మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు. తన కుటుంబ సభ్యులు నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలను పాడారు. అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు. మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం – మోహన రాగం. ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్తరకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబల్ నుంచి రాబోతున్నాయి. మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇది తెలుగు సంగీతాన్ని ప్రపంచ వేదిక పైకి తీసుకెళ్లే కీలకమైన పరిణామంగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!