Avram Manchu: కన్నప్ప మూవీతో మంచు ఫ్యామిలీ మూడో తరం వారసుడి ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమా మీద నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు కూడా తిరిగి వచ్చింది కన్నప్ప టీం. అయితే ఇప్పుడు తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్ను ఇచ్చారు మేకర్లు. ఇప్పటి వరకు ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించగా ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. ఇక మోహన్ బాబు వారసుడిగా విష్ణు మంచు, మనోజ్ మంచు, లక్ష్మీ మంచు రాగా విష్ణు మంచు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నారు. విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని ‘కన్నప్ప’తో మొదలుపెట్టారు.
Also Read:Eagle: బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం… మారింది తేది మాత్రమే మాసోడి మార్క్ కాదు
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ఈ క్రమంలో డాక్టర్ ఎం.మోహన్ బాబు మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది. న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ 90 రోజులు నిర్విరామంగా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. ‘ఈ ‘కన్నప్ప’ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు. ‘అవ్రామ్తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా, సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. ‘కన్నప్ప’ ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని విష్ణు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..