మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో.. ఆమె సినిమా చేయకుండానే టాలీవుడ్ లోను క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘పవన్ 28’ సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరగడంతో స్వయంగా ఆమె స్పందించింది. ‘పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. కానీ ఆయన సినిమాలో తాను నటించడంలేదని’ క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ చిత్రానికి ‘సంచారి’ లేదా ‘స్టేట్‌కి ఒక్కడే’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.