మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈరోజు నుంచి ఆయన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ షూట్‌లో ఆయన జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.
Also Read :K Ramp Producer: మా మీద బ్రతికే నా కొ*కా, లుచ్చా నా కొ*కా…ఉరి తియ్యాలి నిన్ను
ఇక ప్రీ క్లైమాక్స్‌లో విక్టరీ వెంకటేష్ పాత్ర ఎంట్రీ ఉంటుందని, సుమారు 30 నిమిషాల పాటు ఆయన పాత్ర స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్రలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పాపులారిటీ సంపాదించిన బుల్లి రాజు కూడా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది.
Also Read :Dude : 83 కోట్లు కొల్లగొట్టేశారు డ్యూడ్ !
మొదట సాంగ్ ఏంటి ఇలా ఉంది అనిపించినా కూడా, స్లో పాయిజన్‌లాగా ఈ సాంగ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. మొత్తం మీద ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా షూట్‌లో జాయిన్ కావడం గమనార్హం. ఇక మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుందని, అది రిలీజ్ అయితే సోషల్ మీడియా దద్దరిల్లిపోవడం ఖాయం అని అంటున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి
