Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mammootty at OM Pre Release Event: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం’. ‘అమరన్’ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 20న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకలో మమ్ముట్టి మాట్లాడుతూ.. తెలుగు భాష తనకు సరిగా రాదని, అందుకే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నానని తెలిపారు. ‘నా సినిమాలు చాలా తెలుగులో డబ్ అయ్యాయి. వాటన్నింటికీ మంచి స్పందన లభించింది. ఇప్పటికే రాత్రి 10:30 గంటలు అయింది, నాలాంటి సీనియర్ నటుడిని చివర్లో మాట్లాడేందుకు పిలిచారు. సీనియర్ నటులకు ప్రేక్షకులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి ఆశ్చర్యపోయా. అయితే నెను అంత సీనియర్ ఏమీ కాదు, ఇంకా యువకుడినే’ అని మమ్ముట్టి చమత్కరించారు.
Also Read
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Renu Desai: 'ఓం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
‘తెలుగు గడ్డపై మలయాళంలో మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. ఇంగ్లీష్ కూడా అంత గొప్పగా మాట్లాడలేను కానీ ఎలాగోలా మేనేజ్ చేస్తా. ఓం సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో నేను అనారోగ్యంతో ఉన్నా. వెంటనే అంగీకరించలేకపోయా. అయితే దర్శకుడు నా కోసం ఎదురుచూశారు. అందుకే ఈ ప్రాజెక్టును తిరస్కరించలేకపోయా. ఓం సినిమా నాకు చాలా ప్రత్యేకకం. ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. నా సహనటి రేణు దేశాయ్ అద్భుతంగా నటించారు. ధనుష్, నాకు, రేణుకు సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. నాకు తమిళం రాకపోవడంతో సుదీర్ఘమైన డైలాగులు చెప్పడం కొంత కష్టంగా అనిపించింది’ అని మమ్ముట్టి తెలిపారు.
ఇక సాయిపల్లవి గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారని మమ్ముట్టి ప్రశంసించారు. షూటింగ్ సమయంలో అందరితో కలిసి సరదాగా గడిపామని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు లభిస్తున్న ప్రేమ ఎంతో ప్రత్యేకమని, అందుకే ఈ వేడుకకు అభిమానుల కోసం వచ్చానని భావోద్వేగంగా తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. తాను పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం మినహా మిగతా అన్ని అంశాలు అద్భుతంగా కుదిరాయని సరదాగా వ్యాఖ్యానించారు. నవంబర్ 20న ఓం చిత్రాన్ని థియేటర్లలో వీక్షించి విజయవంతం చేయాలని మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులను కోరారు. మమ్ముట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
-
CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
-
Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!