ఆహాలో మమ్ముట్టి ‘వన్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన రెండు సినిమాలు ఈ యేడాది మార్చిలో థియేటర్స్ లో బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. అందులో మొదటిది మార్చి 11న రిలీజ్ అయిన ‘ది ప్రీస్ట్’ కాగా రెండోది అదే నెల 26న వచ్చిన ‘వన్’. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘ది ప్రీస్ట్’ను ఏప్రిల్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు ‘వన్’ మూవీని తెలుగులో డబ్ చేసి, ఆహాలో ఈ నెల 30వ తేదీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
Read Also : సమంత కొత్త లుక్ అదిరిపోయింది…!
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
పొలిటికల్ డ్రామాగా సంతోష్ విశ్వనాథ్ తెరకెక్కించిన ‘వన్’ మూవీలో మమ్ముట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటించారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని కలలుకనే ఈ ముఖ్యమంత్రి అవినీతి పరులైన మంత్రులను, శాసన సభ్యులను ఏరివేయడానికి ‘రైట్ టు రీకాల్’ ను అమలు చేయాలని భావిస్తాడు. అయితే అవినీతిలో కూరుకుపోయిన ఈ సమాజంలో ఉన్నత భావాలు కలిగిన ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేరాయా? లేదా? అన్నదే చిత్ర కథ. మురళీ గోపీ, జోజు జార్జ్, సిద్ధిక్, మాథ్యూ థామస్, ఇషానీ కృష్ణ, గాయత్రి అరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు అందించారు. మరి ఈ పొలిటికల్ డ్రామాను తెలుగు వీక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..