Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మమితా బైజు చేతిలో మూడు సినిమాలు ఉన్నా, ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. కానీ, చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. వరుస హిట్స్ కొడుతున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో చూద్దాం. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్‌తో తెలుగు ఆడియన్స్‌కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది నాలుగు సినిమాలతో వస్తే, రెండు హిట్ అయ్యాయి.
తమిళంలో నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, మలయాళంలో చేసిన ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ సూపర్ హిట్ అయినా, తెలుగు దర్శక నిర్మాతల దృష్టి ఈ అమ్మడిపై పడడం లేదు. మమిత స్టార్స్ పక్కన సెట్ అవుతుందా అన్న డౌట్‌తో ఉన్నారు తెలుగు దర్శకులు. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ రాసుకుంటే ముందు ఆప్షన్ ఈ అమ్మడే. ఎందుకంటే, ఆల్రెడీ నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ ఇలాంటి కథలతో రూపొందినవే. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య, మమిత మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీనే, హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ మధ్య 12 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. మమితా బైజు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో హిట్ అయినా, ఇక్కడ మాత్రం ఆఫర్స్ రావడం లేదు. మలయాళంలో ఛాన్స్ వచ్చినా, అక్కడ రెమ్యునరేషన్ కోటి లోపే ఉంటుంది. తెలుగులో ఆఫర్ రావాలి గానీ, రెండు కోట్లకు పైగా డిమాండ్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నా.. ఆ ఛాన్సే రావడం లేదు అమ్మడికి.
Also Read
తాజావార్తలు
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!