Yellmma : ‘ఎల్లమ్మ’ కోసం యంగ్ సెన్సేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. దీంతో టాలీవుడ్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.
గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అన్నారు. ఇటీవల మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. ఈ ఎమోషనల్ రోల్‌కు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని మేకర్స్ భావించారు. దీనిపై ఆమెతో చర్చలు కూడా జరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌లో యంగ్ సెన్సేషన్ మమితా బైజు పేరు వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజక్ట్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. ఎల్లమ్మలో మమిత ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, డీఎస్పీ సరసన మమితా బైజు జోడీ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎల్లమ్మ ఎవరు అనేది సస్పెన్స్‌లోనే ఉంది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!