Site icon NTV Telugu

Ahimsa: ‘అహింస’కు మసాలా అద్దిన డైరెక్టర్ తేజ.. అదిరిపోయిందిగా

Ahimsa

Ahimsa

Ahimsa: ప్రేమ కథలను తీయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు తేజ ‘అహింస’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో దగ్గుబాటి రాణా సోదరుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో గీతిక కథానాయికగా పరిచయమవుతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇటీవ‌లే ఆర్పీ పట్నాయక్ ఓ అందమైన జానపద మెలోడి స్టయిల్ లో కంపోజ్ చేశారు. వినగానే మనసుని ఆకట్టుకునేలా వున్న పాటలో అభిరామ్, గీతికా ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కాల భైరవ, కీర్తన శ్రీనివాస్ ఈ పాటని లవ్లీగా ఆలపించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read Also: Mega 154: ‘వాల్తేరు వీరయ్య’ గా చిరు.. అదిరిపోయిన టీజర్

దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది మాస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మసాలా సాంగ్. ‘ అమ్మేశానే .. అమ్మేశానే’ అంటూ మంచి ఊపు మీద ఈ సాంగ్ నడుస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను మంగ్లీతో కలిసి ఆర్పీ పట్నాయక్ .. తేజ .. చంద్రబోస్ పాడటం. అమ్మేసానే అంటూ మల్ల నమృత ఐటంసాగ్‌లో న‌ర్తించింది. బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో ఐటెం సాంగ్‌లు చేసిన ఈమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటూ త‌న అందాల‌ను అభిమానుల‌కు ఆర‌బోస్తుంది కూడా.

Read Also: Sudarsan Pattnaik: 4045 దీపాంతలతో కాళీమాత సైకతశిల్పం

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ మార్కుతో వస్తున్న ఈ సినిమాపై, యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఒక యువకుడు చేసే పోరాటమే ఈ కథ. గతంలో తేజ నుంచి వచ్చిన ప్రేమకథా చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన నుంచి వస్తున్న ప్రేమకథా చిత్రం ఇది.

Exit mobile version