NTV Telugu Site icon

Malayali Movie Lovers: పుష్ప 2 కాదు డాకు’నే ముద్దు!

Daaku Maharaaj

Daaku Maharaaj

బాలకృష్ణ తెలుగు హీరో మాత్రమే కాదు. వున్నట్టుండి పాన్‌ ఇండియానే కాదు.. పాన్‌ ఇంటర్నేషనల్‌ హీరో అయిపోయాడు. బన్నీ.. ప్రభాస్‌..ఎన్టీఆర్‌ వంటి పాన్‌ ఇండియా హీరోలను డాకు మహారాజ్‌ మించిపోయి కొత్త రికార్డులు సెట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ రిలీజ్ అయింది. సినిమా ఎట్టకేలకు ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మలయాళీ, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణను తమిళ మలయాళ ప్రేక్షకులు కేవలం ట్రోల్ మెటీరియల్ లా మాత్రమే చూసేవారు.

Kedar Selagamsetty: షాకింగ్: అల్లు అర్జున్ సన్నిహిత నిర్మాత మృతి?

కానీ ఈ సినిమా చూసిన తర్వాత వారంతా బాలకృష్ణ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కంటే మలయాళ ప్రేక్షకులే ఎక్కువగా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఇప్పటికే అల్లు అర్జున్ మలయాళ నాట మంచి క్రేజ్ ఉంది. కానీ పుష్ప2లో స్విమ్మింగ్‌ఫూల్‌ సీన్‌లో ఫహద్ ఫాసిల్ మీద మూత్రం పోసిన నేపథ్యంలో హర్ట్‌ అయిన మలయాళీలు పుష్ప 2 మీద విముఖత వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా మాత్రం బాగా నచ్చేయడంతో పుష్పకంటే ఇదే బాగుందంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాని రోస్ట్ చేస్తూ మలయాళ యూట్యూబర్ ఒకరు యూట్యూబ్లో వీడియో పెడితే ఆ వీడియో కింద ఒక రేంజ్ లో బాలయ్యని వెనకేసుకు వస్తూ ఆ యూట్యూబర్ మీద యుద్దమే చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా లాంటి దేశాలలో సైతం ప్రస్తుతానికి ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. నిజానికి ఈ సినిమాకి సంక్రాంతికి విడుదలైనప్పుడే మంచి టాక్ వచ్చింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా దెబ్బ గట్టిగా పడటంతో బ్రేక్ ఈవెన్ అయినా సరే లాభాలు దక్కలేదు.