Malayali Movie Lovers: పుష్ప 2 కాదు డాకు’నే ముద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ తెలుగు హీరో మాత్రమే కాదు. వున్నట్టుండి పాన్ ఇండియానే కాదు.. పాన్ ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు. బన్నీ.. ప్రభాస్..ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా హీరోలను డాకు మహారాజ్ మించిపోయి కొత్త రికార్డులు సెట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ రిలీజ్ అయింది. సినిమా ఎట్టకేలకు ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మలయాళీ, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణను తమిళ మలయాళ ప్రేక్షకులు కేవలం ట్రోల్ మెటీరియల్ లా మాత్రమే చూసేవారు.
Kedar Selagamsetty: షాకింగ్: అల్లు అర్జున్ సన్నిహిత నిర్మాత మృతి?
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
కానీ ఈ సినిమా చూసిన తర్వాత వారంతా బాలకృష్ణ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కంటే మలయాళ ప్రేక్షకులే ఎక్కువగా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఇప్పటికే అల్లు అర్జున్ మలయాళ నాట మంచి క్రేజ్ ఉంది. కానీ పుష్ప2లో స్విమ్మింగ్‌ఫూల్ సీన్లో ఫహద్ ఫాసిల్ మీద మూత్రం పోసిన నేపథ్యంలో హర్ట్ అయిన మలయాళీలు పుష్ప 2 మీద విముఖత వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా మాత్రం బాగా నచ్చేయడంతో పుష్పకంటే ఇదే బాగుందంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాని రోస్ట్ చేస్తూ మలయాళ యూట్యూబర్ ఒకరు యూట్యూబ్‌లో వీడియో పెడితే ఆ వీడియో కింద ఒక రేంజ్ లో బాలయ్యని వెనకేసుకు వస్తూ ఆ యూట్యూబర్ మీద యుద్దమే చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా లాంటి దేశాలలో సైతం ప్రస్తుతానికి ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. నిజానికి ఈ సినిమాకి సంక్రాంతికి విడుదలైనప్పుడే మంచి టాక్ వచ్చింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా దెబ్బ గట్టిగా పడటంతో బ్రేక్ ఈవెన్ అయినా సరే లాభాలు దక్కలేదు.
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!