ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎవ్రీ ఫైడేలాగా.. ఈ వీకెండ్ కూడా కొన్ని మలయాళ సినిమాలు సందడి చేయబోతున్నాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ హృదయ పూర్వం. లోకతో పోటీగా వచ్చినప్పటికీ. ఆగస్టు 28న రిలీజైన ఈ ఫిల్మ్ కేరళలో మంచి వసూళ్లనే రాబట్టుకుంది. రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హృదయపూర్వం సెప్టెంబర్ 26 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read : STAR HERO : డైరెక్షన్ లో వేలుతో పాటు అన్ని పెట్టేస్తున్న స్టార్ హీరో
కళ్యాణి ప్రియదర్శన్ లోక వచ్చిన మరుసటి రోజే అంటే ఆగస్టు 29నే ఆమె నటించిన మరో ఫిల్మ్ ‘ఒడుం కుతిరా చాడుమ్ కుతిరా’ రిలీజయ్యింది. ఫహాద్ ఫజిల్, కళ్యాణి నటించిన ఈ సినిమా లోక మేనియా ముందు కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా సెప్టెంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీస్సే కాదు హారర్ కామెడీ కూడా ఈ వారమే సందడి చేయబోతుంది. కేరళలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన ఫిల్మ్ సుమతి వలవు. 1950లో కేరళలోని ఓ ప్రాంతంలో సుమతి అనే గర్బిణీని ఆమె ప్రియుడు హత్య చేశాడని, అప్పటి నుండి ఆప్రాంతంలో దెయ్యం అయ్యి తిరుగుతుందని కథనాలు ఉన్నాయి. ఈ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమానే సుమతి వలవు. అర్జున్ అశోకన్, ఓ భామ అయ్యో రామ ఫేం మాళవిక మనోజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 1న థియేటరల్లో పలకరించింది. ఈ ఫ్రైడే నుండి జీ5లో భయపెట్టనుంది. ఇవే కాదు ఫ్యామిలీ డ్రామా సర్కీత్ కూడా సెప్టెంబర్ 26 నుండి మనోరమ మాక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆసిఫ్ అలీ, దివ్య ప్రభా, ఆర్షన్ హైదర్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా మే8న థియేటర్లలోకి రాగా ఇప్పుడు నాలుగు నెలలకు ఓటీటీ బాట పట్టింది. ఈ వీకెండ్‌లో ఎమోషన్స్, థ్రిల్, ఫన్ అన్నీ మేళవించిన మలయాళ సినిమాలను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
