ఆ వీడియోలో ఉన్నది నేను కాదు… ఏడ్చేసిన నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ నటి రెమ్య సురేష్ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. ఇంటర్నెట్ లో తన మార్ఫింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అలప్పుజ పోలీసులకు, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వీడియోలోని మహిళ రెమ్య సురేష్‌ను పోలి ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయిపోయారు. ఈ పరీక్ష సమయాల్లో తన భర్త తనకు అండగా నిలుస్తున్నాడని రెమ్య సురేష్ తన వీడియోలో పేర్కొన్నారు. వీడియోలోని మహిళ తాను కాదని, తన కెరీర్‌లో ఎలాంటి రాజీ పడకుండా ఈ దశలో ఉన్నానని చెబుతూ రెమ్య ఏడ్చేశారు. “నేను రెమ్య సురేష్, ఇంటర్నెట్‌లోవైరల్ అవుతున్న వీడియోతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి దాన్ని వ్యాప్తి చేయవద్దు. వీడియోలో ఉన్న ఆమె నాలాంటి ముఖ పోలికలతో ఉంది. అయితే నేను బాగా తెలిసిన వారు నాలో, తనలో ఉన్న పోలికను గమనించగలరు. కానీ తెలియని వారు మాత్రం నేనే అనుకుంటారు. అదే నాకు భయంగా ఉంది” అని రాశారు. తనకు మద్దతుగా తన కుటుంబం ఉండడంతో ఈ సమస్యను పరిష్కరించుకోగలనని రెమ్య సురేష్ అన్నారు. ఆమె చివరిసారిగా నయనతార నటించిన ‘నిజాల్’ చిత్రంలో కన్పించింది.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!