Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Santhosh Nair Dies: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్(65) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. నటుడి మరణ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎనాత్ సమీపంలో చోటుచేసుకుంది. సంతోష్ నాయర్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం వెంటనే ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
చికిత్స పొందుతున్న సమయంలో సంతోష్ నాయర్‌కు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి మరింత విషమించి, చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య రాజలక్ష్మి మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. సంతోష్ నాయర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన తండ్రి సి.ఎన్. కేశవన్ నాయర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాగా, తల్లి పి. రాజలక్ష్మి అమ్మ రిటైర్డ్ టీచర్. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడంతో ఆయనను తాత, నానమ్మ పెంచారు.
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే, సంతోష్ నాయర్ 1982లో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆయన 100కి పైగా చిత్రాలలో నటిస్తూ, కథానాయకుడు, ప్రతినాయకుడు, సహాయ పాత్రలు, హాస్య పాత్రలు వంటి విభిన్న పాత్రల్లో మెప్పించారు. బుల్లితెరపైనా తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన “మోహినియాట్టం” చిత్రం విడుదలై ప్రేక్షకులను అలరించింది. అదే ఆయన చివరి చిత్రంగా నిలిచింది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సహచరులు పేర్కొంటున్నారు. మొత్తంగా, సంతోష్ నాయర్ అకాల మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ఇది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
తాజావార్తలు
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?