Site icon NTV Telugu

Malavika : టాలీవుడ్ డైరెక్టర్స్ పై యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్.

Malavika Mihan

Malavika Mihan

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్.. సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2013లో ‘పట్టం పోల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌ల్లో విజయ్ హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రజనీకాంత్ తో ‘పెట్టా’, ధనుష్ తో ‘మారన్’, విక్రమ్ తో ‘తంగళాన్’ వంటి వరుస సినిమాల్లో నటించి అలరించింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

Also Read: Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..

అయితే మాళవికా ప్రజంట్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తరుచూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి చెప్పుకొచ్చింది.. ‘ నేను ముంబైలో పెరిగా కాబట్టి, దక్షిణాది సినిమాల గురించి నా కెరీర్ మొదట్లో నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా ఇష్టపడతారని ఆ తర్వాత అర్ధం అయింది. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు చాలా మంది శరీర భాగాలు జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ మాళవికా మోహనన్‌ తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version