Site icon NTV Telugu

Malavika Mohanan: ఆయనతో నటించాలని ఉన్నా..ఆ సినిమా నేను చేయట్లేదు !

Malavika Mohanan

Malavika Mohanan

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే బాబీ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్టింగ్ సహా క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఒకరకంగా ప్రీ-ప్రొడక్షన్లో బాబీ టీమ్ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయం మీద అధికారికంగా స్పందించింది.

Also Read :Chiranjeevi: నన్ను ఇంకా కించపరుస్తూనే ఉన్నారు.. చిరంజీవి మరో కంప్లైంట్

తన ‘X’ వేదికగా ఆమె స్పందిస్తూ, “నేను గత కొద్ది రోజులుగా మెగా 158 సినిమాలో నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వార్తలు రావడాన్ని చూస్తున్నాను. నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి నటించాలనే ఉద్దేశం ఉన్నా, ఈ సినిమాలో మాత్రం నటించడం లేదు. వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. ప్రస్తుతానికి అవన్నీ అవాస్తవమే” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మాళవిక మోహనన్ ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఆమె పలు ప్రాజెక్టులలో భాగమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్లు కూడా వార్తలు రాగా, ఆమె ఇలా స్పందించింది.

Exit mobile version