Site icon NTV Telugu

Malavika : అనుకున్నా గౌరవం దక్కింది..

Malavika Mohan

Malavika Mohan

ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇందులో మాళవిక మోహనన్, అలాగే మ‌రో క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ చేస్తున్నారు. అయితే ఇందులో మాళవిక సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన ఫాలోవర్లతో టచ్‌లో అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో మాళవిక ముచ్చటించింది. ఈ క్రమంలో మాళవిక తన కో స్టార్ అయిన ప్రభాస్ గురించి స్పందించింది. ఓ అభిమాని ప్రభాస్ గురించి చెప్పండి మేడం అని మాళవికను అడిగాడు..

also Read: Mani Ratnam : సినిమా.. ఒక వ్యాపారం అయిపోయింది

‘ప్రభాస్‌తో నాకు పరిచయం కాకముందు పలు ఇంటర్వ్యూల్లో ఆయన్ను చూశా. ఆ మాట్లాడే తీరు చూసి.. ఎవరితో ఎక్కువగా మాట్లాడడేమో అనుకున్నా. కానీ ఆయనతో కలిసి పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. నిజానికి ఆయనంత సరదాగా మనిషిని ఎక్కడ చూడలేదు. ఆయన ఉంటే సెట్‌ అంతా కోలాహలమే. డల్‌ మూమెంట్‌ అనేది ఆయన దరిదాపుల్లో ఉండదు. కానీ ఆయన స్టేజ్ దోంగ.. మైక్ ఇస్తే వెంటనే పక్కన వారికి పాస్ చేస్తారు. అసలు మాట్లాడరు’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక. ఇక ఇంతలోనే ‘నేను సాధించాను.. అని మీకు అనిపించిన క్షణమేది? అని ఓ అభిమాని అడగ్గా.. ‘ ఒక్కప్పుడు క్యూ లైన్‌ల్లో వేచి ఉండకుండా, ఇప్పుడు డైరెక్ట్‌గా దేవాలయాల్లోకి అడుగుపెట్టిన క్షణం ఏదో సాధించాననే ఫీలింగ్‌ వచ్చింది.. నిజంగా ఒక గౌరవం దక్కాలి అంటే అంత ఈజీ కాదు’ అని సమాధానమిచ్చింది మాళవిక. అలాగే ‘ది రాజాసాబ్‌’ తర్వాత మీరు చేయబోయే తెలుగు సినిమా ఏది? అని అడగ్గా.. ‘మీరే చెప్పండి?.. మీరు నన్ను ఏ హీరోకు జంటగా చూడాలనుకుంటున్నారు? ’ అంటూ ఎదురు ప్రశ్నించి నవ్వేసింది మాళవిక. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version