AindhamVedham : ‘ఐందామ్ వేదం’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
- జీ5లో అక్టోబర్ 25న స్ట్రీమింగ్ కాబోతోన్న ‘ఐందామ్ వేదం’
- లీడ్ రోల్ లో నటిస్తున్న కబాలి భామ సాయి ధన్సిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన ఐందామ్ వేదం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ఎల్. నాగరాజన్ తెరకెక్కించారు. ఈ మూవీలో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Also Read
తాజాగా ఐందామ్ వేదం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ‘వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు సూర్యుడ్ని చూసే విధంగా ఒకే వరుసలో ఉంటాయట.. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది’, ‘నాలుగు వేదాలు ఉన్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతోంది’ అంటూ సాగిన ఈ ట్రైలర్‌లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియ ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి నాగ ఈ ‘ఐందామ్ వేదం’ను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, ఇచ్చిన ఆర్ఆర్, భయపెట్టేలా చేసిన కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ‘ఐందామ్ వేదం’ జీ5 ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఓటీటీలోకి అక్టోబర్ 25న రాబోతోంది. అందరికీ తెలిసిన నాలుగు వేదాలు కాకుండా.. ఐదో వేదాన్ని జీ5 అందరికీ చూపించబోతోండటం ఆసక్తికరంగా ఉంది.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?