Site icon NTV Telugu

‘థాంక్యూ బ్రదర్’ మేకింగ్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో..!

యాంకర్ అనసూయ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఆమె ప్రధానపాత్రలో ‘థ్యాంక్యూ బ్రదర్‌’ నటించింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అశ్విన్‌ విరాజ్‌ కీలకపాత్రలో నటించారు. నూతన రమేష్‌ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను ‘ఆహా’ సంస్థ విడుదల చేసింది. లాక్‌డౌన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా చిత్రీకరించారనే అనే విషయాలన్నింటిని ఈ మేకింగ్‌ వీడియోలో చూపించారు. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Exit mobile version