NTV Telugu Site icon

SSMB29 : మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ మరింత ఆలస్యం కానుందా..?

Whatsapp Image 2024 05 04 At 8.16.56 Am

Whatsapp Image 2024 05 04 At 8.16.56 Am

సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు.ప్రస్తుతం మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్నారు. ఆఫ్రికన్‌ ఫారెస్ట్ అడ్వెంచర్‌ నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది.
“ఆర్‌ఆర్‌ఆర్‌” వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా మహేష్‌బాబు కెరీర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతుంది.

ఈ సినిమా కోసం మహేష్‌బాబు వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు.సినిమాలో తన పాత్ర కోసం మేకోవర్ అవుతున్నారు. ‘ది ఇండియానా జోన్స్‌’ తరహా లో సాగే అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమా ను మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించి, జూన్‌ లేదా జూలైలో షూటింగ్‌ మొదలుపెడుతున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూట్‌ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం .ఈ సినిమాకు కె.ఎల్‌.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ బాబును రాజమౌళి సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం.