సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఫ్యాన్ వరల్డ్ యాక్టర్‌గా మారబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీస్తోంది. ఆయన మేనకోడలు ఎవరా అని ఆశ్చర్యపోకండి. గతంలో నటిగా పలు సినిమాల్లో నటించిన మంజుల ఘట్టమనేని స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆమె నటనతో పాటు పెయింటింగ్, డాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, ఇలా అనేక అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఆమె నటిగా మారకముందే ఒక జ్యువెలరీ క్యాంపెయిన్ తర్వాత, జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించారు.
Also Read : Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి..
నిజానికి పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది. సినిమాలో కెమెరా ముందుకొచ్చిన జాహ్నవి తన సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆమె నటన, నృత్యం నేర్చుకుంటూ తన ప్రతిభను నైపుణ్యంగా మార్చుకుంది. నిజానికి మంజుల దశాబ్దాల క్రితమే బాలకృష్ణ పక్కన హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ కృష్ణ అభిమానులు ఫీల్ అవుతున్నారనే కారణంగా ఆమె హీరోయిన్గా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె కుమార్తె హీరోయిన్గా ఇంటర్వ్యూ ఇస్తూ ఉండడంతో మంజుల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు తనను హీరోయిన్గా నటించవద్దని కోరిన వారే ఇప్పుడు తన కుమార్తెను సినీ రంగంలోకి రావాలని కోరుతున్నారని ఆమె అన్నారు. తన ప్రార్థనలకు తన కుమార్తె చిరునవ్వు సమాధానం అని మంజుల చెప్పుకొచ్చారు.
