Site icon NTV Telugu

“సర్కారు వారి పాట” లీక్స్ పై మహేష్ అసంతృప్తి

The Kollywood star plays an antagonist in Sarkaru Vaari Paata

మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే మహేష్ బాబు చిత్రానికి కూడా ఇప్పుడు లీకుల బాధ తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని కొన్ని సెట్ వర్క్ పిక్స్, కీ స్నాప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం స్పెషల్ డైరెక్టర్ ?

అందులో భాగంగానే మహేష్ చెప్పిన డైలాగ్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ఎలాంటి లీకులు బయటకు రావద్దని, సస్పెన్స్ కంటిన్యూ చేయాలని టీం మొత్తాన్నీ అభ్యర్థించారట. మహేష్ కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సినిమా కథ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారు కాబట్టి ఈ లీకులు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తాయని ఆయన భావిస్తున్నారట. ప్రొడక్షన్ హౌస్ సెట్స్ లో జాగ్రత్తగా ఉండాలని, అలాగే కఠినంగా ఉండాలని మహేష్ హెచ్చరించారని సమాచారం. మరి ఇప్పటికైనా లీకులు ఆగుతాయేమో చూడాలి.

Exit mobile version