“ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ?

“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాకు ప్రధానంగా ఎంఎం కీరవాణి స్వరాలు సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రత్యేక ప్రమోషనల్ సాంగ్ కోసం మాత్రం మేకర్స్ అనిరుధ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో అనిరుధ్ స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు వేయనున్నాడట.

Read Also : సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు.. ప్రభుత్వం అనుమతి

సాంగ్ పూర్తయ్యాక మొత్తం టీం జార్జియాకు ప్రయాణం కానుంది. అక్కడ సినిమాలోని భారీ సాంగ్ ను చిత్రీకరిస్తారు. దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా అలియా భట్, అజయ్ దేవగన్ ఇద్దరూ మరో రెండు ప్రధాన ఆకర్షణలు. జరిగిన ఆలస్యం వల్ల 2022లో ఈ చిత్రం విడుదలవుతుందని అంతా భావిస్తుండగా రాజమౌళి మాత్రం ముందుగా చెప్పినట్టుగానే మూవీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 13న “ఆర్ఆర్ఆర్” విడుదల కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-