మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీ, అంటే శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతలు ఎవరు అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి. సుమను ఈవెంట్‌కు దూరంగా ఉంచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం మేరకు, ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది మహారాష్ట్రకు చెందిన ఫేమస్ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ (Ashish Chanchlani) అని తెలుస్తోంది. అతనికి నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది; ఎన్నో సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొన్న అనుభవం ఉంది. వీరిద్దరూ కలిసి ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
Also Read : Kaantha : ‘కాంత’ మూవీ గురించి.. సర్‌ప్రైజ్ రివీల్ చేసిన రానా..
అయితే, ఫ్యాన్స్‌కు అనుమతి ఉంటుందా లేదా అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాలలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాక, బహిరంగ ఈవెంట్స్ అన్నింటికీ అనుమతులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫ్యాన్స్ సమక్షంలో ఈవెంట్ జరుగుతుందా, లేక కేవలం ఒక క్లోజ్డ్ ఈవెంట్‌గా జరుగుతుందనే విషయంపై ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
