మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2017 నుండి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయాణ గాథను త్రీడీలో మూడు భాషల్లో, మూడు భాగాలుగా నిర్మించాలని కలలు కంటున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకునే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నితేశ్ తివారి, రవి ఉద్యావర్ భుజానకెత్తుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రను హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటిస్తారనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
Read Also: ‘కలర్స్’ స్వాతి కమ్ బ్యాక్ మూవీ స్టిల్ లీక్!
Also Read
- Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
- Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
- Adipurush: 'ఆదిపురుష్' నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
- AA23: హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు! బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా 'AA23'?
కానీ విశేషం ఏమంటే… ఈ మేగ్నమ్ ఓపస్ మూవీలో రాముడి పాత్రను ప్రిన్స్ మహేశ్ బాబు చేయబోతున్నాడనీ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మధు మంతెనను ఇదే విషయమై అడిగితే ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం ఇచ్చారట. మహేశ్ బాబు రాముడిగా నటించబోతున్నాడనే వార్తను ఖండించకుండా… ఖరారు చేయకుండా… ‘ప్రేక్షకులు కోరుకునే భారీ తారాగణం ఈ సినిమాలో ఉండబోతోంది’ అని బదులిచ్చాడట. అయితే… ఈ యేడాది దీపావళికి ప్రతిష్ఠాత్మకమైన రామాయణ్ ప్రాజెక్ట్ లో రాముడిగా మహేశ్ బాబు పేరును అధికారికంగా ప్రకటిస్తారనేది తెర వెనుక వినిపిస్తున్న మాట. అదే నిజమైతే… మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరూ పాన్ ఇండియా మూవీలో…. అదీ మైథాలజీ మూవీలో రాముడి పాత్ర చేయడం అనేది గొప్ప చారిత్రక ఘటనే అవుతుంది. దీనికోసం ఆస్కార్ విన్నింగ్ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారట.
తాజావార్తలు
-
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
-
Netanyahu: వస్తున్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు సవాల్
-
Vastu Tips for Money: అప్పులు తీరాలంటే.. ఈ రూల్స్ పాటించండి.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
-
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!