NTV Telugu Site icon

Maddock Films: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ

Chaava A

Chaava A

బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా మారాడు దినేష్ విజన్.

Nani : ఆ నాని సినిమా లేనట్టే?

స్త్రీ తర్వాత కరోనా వల్ల కొన్ని మంచి సినిమాలు ఓటీటీలోకి తెచ్చింది మెడాక్. మళ్లీ బేధియాతో ఊపందుకున్న నిర్మాణ సంస్థ.. అక్కడ నుండి వెను తిరిగి చూసుకోలేదు. ఓవైపు థియేటర్ కంటెంట్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఓటీటీ సినిమాలు తెరకెక్కించింది. తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా, ముంజా, స్త్రీ2, స్కై ఫోర్స్, ఇప్పుడు ఛావాలాంటి పిక్చర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని.. టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. మెడాక్ పట్టుకుంటే సినిమాకు కాసుల వర్షం కురవడం ఖాయం అనేట్లుగా మారింది. స్త్రీ 2తో హైయెస్ట్ గ్రాసర్ మూవీని చూసిన నిర్మాణ సంస్థ..ఇప్పుడు విక్కీ కౌశల్ ఛావాతో 500 కోట్ల మార్క్ ను మరోసారి టచ్ చేసింది. ఇలా ఏడాదిలోనే రెండు భారీ హిట్లను చూసింది ప్రొడక్షన్ హౌజ్. ఇలాంటి సక్సెస్ రీసెంట్ టైమ్స్ లో మరో నిర్మాణ సంస్థకు లేదనే చెప్పొచ్చు. ఈ సినిమాలిచ్చిన జోష్ తో పరమ్ సుందరి, ధామా, భూల్ చుక్ మాఫ్, తేహ్రన్ లాంటి చిత్రాలను నిర్మిస్తోంది మెడాక్. వీటిల్లో ఏదీ హిట్టు కొట్టినా.. నార్త్ బెల్ట్ లో వన్ ఆప్ ది టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ గా మారిపోవడం ఖాయం.