Site icon NTV Telugu

ఆగస్టు 6న ‘మ్యాడ్’

Mad Telugu Movie to Release on August 6th

ఈ వారంతంలో ఐదు చిత్రాలు విడుదల కాబోతుండగా, వచ్చే శుక్రవారానికి కూడా చిన్న సినిమాలు క్యూ కట్టడం మొదలెట్టేశాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘మ్యాడ్’ సినిమా కూడా చేరింది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ ఆగస్ట్ 6న రాబోతోంది. ఈ సినిమాను టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి తమ మిత్రులతో కలిసి నిర్మించారు. లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో రెండు జంటల కథతో చూపిస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు చెబుతున్నారు.

Read also : తైమూర్ ‘భారం’ తాను మోయలేనంటోన్న సైఫ్!

కథ గురించి వివరంగా దర్శకుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ, ” జీవితంలో ఎంతో ముఖ్యమైన సందర్భం వివాహం. ఇలాంటి పెళ్లి విషయంలో నేటి యువత చాలా మంది సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే ఎంత స్పీడ్ గా పెళ్లిళ్లు జరుగుతున్నాయో, అంతే స్పీడ్ గా విడిపోతున్నారు. ఈ పరిస్థితికి ఆ జంటలతో పాటు తల్లిదండ్రుల తొందరపాటు కూడా కారణమే. ఇలా పెళ్లి సహజీవనం వంటి విషయాల్లో రెండు జంటలు ఎదుర్కొన్న పరిస్థితులను ఆసక్తికరంగా ఈ సినిమాలో తెరకెక్కించాం. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం.. అన్నారు. ఈ చిత్రానికి మోహిత్ రెహ్మానికయాక్ సంగీతం అందించారు.

Exit mobile version