Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..

Gopichand

Gopichand

Gopichand34: టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ రోజు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ హీరో బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘సింగ’ (SINGA) అనే ఇంట్రెస్టింగ్ అండ్ పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. గోపీచంద్ హీరోగా 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అదిరిపోయే స్టంట్ సీక్వెన్సులు అందించిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. టైటిల్‌కు తగ్గట్టే గోపీచంద్ మార్క్ హై-వోల్టేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌లో తెలుస్తోంది.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ వెంకట్ మెగాఫోన్ పడుతుండటం, గోపీచంద్ కంప్లీట్ మాస్ అవతారంలో నటిస్తుండటంతో ఈ ‘సింగ’ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

×
×
Ad