సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. నందినీ రెడ్డి మార్క్ క్లాస్ ఎమోషన్స్, సమంత ఊరమాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అల్టిమేట్ ‘గోల్డెన్ రన్’ కొనసాగిస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా సాధిస్తోన్న కలెక్షన్ల స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా అఫీషియల్ కలెక్షన్లపై మేకర్స్ ఒక అఫీషియల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అధికారికంగా రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం సమంత వన్-వుమెన్ షోగా థియేటర్లలో రచ్చ చేస్తోన్న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 73 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాయిని అధిగమించింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఓవర్సీస్, కోలీవుడ్ మార్కెట్లలోనూ ఈ చిత్రం అద్భుతమైన హోల్డ్‌ను ప్రదర్శిస్తోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోన్న ఈ ‘బంగారం’.. అతి త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయి రోజులు గడుస్తున్నా.. ఆడియన్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సరైన సినిమాలు ఏవీ ఈ వారం కూడా రిలీజ్ కాక పోవడంతో ఈ వీకెండ్ కింగ్స్ కూడా ఊహించని స్థాయిలో నడుస్తున్నాయి. ఉదయం షోల నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

