సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సునామీని కొనసాగిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం వీకెండ్స్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ సినిమా సాధించిన ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే టికెట్ బుకింగ్స్ రికార్డులను సమంత తన లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తిరగరాస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అయిన BookMyShow and District యాప్స్ లలో కలిపి ఇప్పటివరకు ఏకంగా 17 లక్షలకు పైగా (1.7 MILLION+) టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్ అయి రోజులు గడుస్తున్నా సరే, బుకింగ్స్ ఏమాత్రం తగ్గకపోగా ప్రతి గంటకూ వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. సమంత వన్-వుమెన్ షోగా బాక్సాఫీస్ వద్ద చేస్తోన్న ఈ గోల్డెన్ రన్ టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో సాగే లవ్, ఎమోషన్స్ మరియు సమంత చీరకట్టులో చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసాయి. లాంగ్ రన్‌లో ఈ ‘బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి!

