MAA : ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం.. డీజీపీకి ‘మా’ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MAA Association Complains to DGP over Trolling: తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరపున శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు డీజీపీని కలిశారు. సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని డీజీపీని కలిసిన మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేశారు.. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి అందచేశారు మా అసోసియేషన్ ప్రతినిధులు. ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానళ్ళను టెర్మినేట్ చేశామని ఈ సందర్భంగా డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇక ప్రత్యేకంగా మా దాంట్లో సైబర్ క్రైమ్ టీమ్ పెట్టుకున్నామని కూడా డీజీపీకి వెల్లడించారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామని కూడా వెల్లడించారు.
Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి పుష్పా ఇది..!
Also Read
ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం అని లేడీ ఆర్టిస్టుల పై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయి అని అన్నారు. కుటుంబాలు చాలా బాధ పడుతున్నాయని, క్యారెక్టర్ ను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్నారని, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేశామని అన్నాడు. ట్రోల్స్ చేసేవి 200పైగా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటికే 25 ఛానల్స్ ఇప్పటికే డౌన్ చేసాము, మీరు కూడా అందులో ఉంటే ఆ లింక్ లు తీసి వెయ్యండన్నారు. ఈ అంశంలో డిజిపి సానుకూలంగా స్పందించారని సైబర్ సెక్యూరిటీ వింగ్లో స్పెషల్ సెల్ దీనిమీద ఫోకస్ పెడుతుందని చెప్పారని వెల్లడించారు. డిపార్ట్మెంట్ అండ్ సినిమా వాళ్ళం సమన్వయం చేసుకుని ఇలాంటి వారి పై చర్యలు తీసుకుంటామని శివ బాలాజీ అన్నారు. ప్రతి దానికి హద్దులు ఉంటాయన్నారు ఆయన.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!