Lyca Productions: 9 ప్రాజెక్ట్‌లను ప్రకటించిన లైకా సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్) సమ్మిట్, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినోద రంగంలో కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో నిర్వహించబడింది. మే 1వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, భారతీయ చిత్ర పరిశ్రమ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి 9 కొత్త సినిమా ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు ఒక సంచలన ప్రకటన చేసింది.
Read More:Manchu Vs Allu: అందుకే వెనక్కి తగ్గిన అల్లు కాంపౌండ్?
Also Read
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్‌స్టార్ తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6’ స్ట్రీమింగ్!
- Mega 158: డాడీ కోసం పెద్ది!
ప్రధానమంత్రి మోదీ యొక్క దూరదృష్టి మరియు లక్ష్యాలకు అనుగుణంగా, భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా రూపొందించేందుకు ఈ 9 ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు లైకా సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు కథలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించే లక్ష్యంతో మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో సహకారంతో నిర్మించబడనున్నాయి.
ఈ సందర్భంగా లైకా గ్రూప్ చైర్మన్ డా. అల్లిరాజా సుభాస్కరణ్ మాట్లాడుతూ, “భారతీయ మూలాలతో ప్రపంచ స్థాయి సంస్థగా, లైకా గ్రూప్ భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆకర్షణీయ కథలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది,” అని పేర్కొన్నారు.
Read More:Venkatesh: అన్నీ సెట్టైనా ఈసారి సంక్రాంతి మిస్?
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, హోం వ్యవహారాల సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్‌తో పాటు లైకా చైర్మన్ డా. సుభాస్కరణ్, మహవీర్ జైన్ వంటి ప్రముఖులు పాల్గొని, భారతీయ సినిమా యొక్క భవిష్యత్తుపై చర్చించారు.
తాజావార్తలు
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్‌ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!