NTV Telugu Site icon

LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..

Trivikram

Trivikram

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read : KA : కిరణ్ అబ్బవరం కోసం అక్కినేని నాగ చైతన్య..

ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశాన్ని త్రివిక్రమ్ పంచుకున్నారు. డబ్బు గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ” నేను సునీల్ చిత్ర పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో డబ్బు పట్ల నాకున్న అశ్రద్ధ పట్ల నాకు సునీల్ కు ఓక ఇన్సిడెంట్ జరిగింది. మా దగ్గర రూ. 30 ఉండేవి. అవి మా దగ్గర ఉన్న లాస్ట్ ముప్పై రూపాయలు. అప్పటికే మా రూమ్ ఓనర్ ఖాళీ చేయమన్నాడు. ముప్పై రూపాలతో రోడ్ మీదకు వచ్చి నిలబడి ఉన్నాం. అప్పడు సునీల్ వాటిని ఎలా జాగ్రత్తగా ఖర్చుచేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో కోక్ టిన్ ఉండేవి దాని ఖరీదు 28 రూపాయాలు. నేను సునీల్ దగ్గర ఆ ముప్పై రూపాయలు తీసుకుని ఒక కోక్ కొనేసాను’ అని అన్నారు ఆలా చేతిలో రూపాయి లేకుండా ఎలా సంపాదించాలి అని అలోచనతో  కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.