NTV Telugu Site icon

LuckyBaskhar : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న ‘లక్కీ భాస్కర్’..

Untitled Design (27)

Untitled Design (27)

దుల్కర్ సల్మాన్ అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. మహానటి తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సీతారామం తో సోలో హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మార్కట్ సెట్ చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెంట్ తో లక్కీ భాస్కర్ అనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులో పరిచయం చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రం తెరకెక్కుతోంది.

Also Read : Devara : బాహుబలి -2 రికార్డును బద్దలు కొట్టబోతున్న దేవర – 1

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను మొదట ఈ సినిమాను సెప్టెంబరు 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సగం షూటింగ్ జరిగాక కాస్త ముందుకు వచ్చి సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తామని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. కానీ సెప్టెంబరు 5న తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం G.O.A.T రిలిజ్ కావడంతో రేస్ నుండి తప్పుకున్నాడు లక్కీ భాస్కర్. G.O.A.T రిలీజ్ అవ్వడం తమిళం కాకుండా మిగిలిన అన్ని భాషల్లో ఆ సినిమా డిజాస్టర్ కావడం చక చక జరిగిపోయాయి. ఒకవేళ సెప్టెంబరు 7న రిలీజ్ చేసి ఉంటె తెలుగులో అప్పుడు ఏ సినిమాలు లేని కారణంగా మంచి స్టార్ట్ దొరికి వుండేది. అలాగే మలయాళంలోనూ ఓనమ్ హాలిడేస్ కలిసి వచ్చేవి భారీ కలెక్షన్స్ రాబట్టి ఉండేది. తాజాగా ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

Show comments