Site icon NTV Telugu

Pakka Commercial: భారీగా తగ్గిన టికెట్‌ రేట్లు.. నెటిజన్ల కామెంట్లు

Pakka Camecial

Pakka Camecial

కొంత కాలంగా వ‌రుస ఫ్లాప్ లతో స‌త‌మ‌తమైన గోపిచంద్‌కు సీటీమార్ సినిమా కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఈ చిత్రం ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మర్షియ‌ల్‌గా కూడా వ‌సూళ్ళు చేసింది. కాగా ప్ర‌స్తుతం గోపిచంద్ న‌టించిన‌ తాజా చిత్రం ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’. ఈ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో.. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రిత‌మే ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌టంతో.. మూవీ మేక‌ర్స్ టిక్కెట్ రేట్ల‌ను ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌లో సింగిల్ థియేట‌ర్‌లో రూ.100 కాగా.. మ‌ల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉండునుందని ప్ర‌క‌టించారు మూవీ స‌భ్యులు. ఈ మ‌ధ్య కాలంలో గింత త‌క్కువ టిక్కెట్ రేట్ల‌తో ఏ సినిమా విడుద‌ల కాలేదని.. దీనిపై పలువురు నెటీజ‌న్లు.. చిత్ర‌బృందాన్ని ప్ర‌సంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇక ముందుకూడా విడుద‌ల‌య్యే సినిమాల‌కు ఇదే రేట్లు కొనసాగిస్తే.. కుటుంబంతో స‌హా ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్ల‌కు పెద్ద సంఖ్య‌లో వ‌స్తారని నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఏపీలో సింగిల్ థియేట‌ర్‌లో రూ.100 కాగా మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా న‌టించ‌గా.. స‌త్య‌రాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, అన‌సూయ‌, రావుర‌మేష్ కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్ర‌యేష‌న్స్‌, జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై బ‌న్నివాస్‌, వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. సంగీతాన్ని జేక్స్ బేజోయ్ అందించాడు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (ఆదివారం) హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానుండ‌టంతో.. ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

Kartik Aaryan : కార్తీక్ ఆర్యన్ కు మెక్‌లారెన్ స్పోర్ట్స్ కారు బహుమతి!

Exit mobile version