Lokesh : ‘ఎల్సీయూ’ ఆ ఒక్క ఆలోచనతో మొదలైంది – లోకేష్ ఓపెన్ టాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినిమా పరిశ్రమను ఓ కొత్త దిశగా నడిపిస్తున్న ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనకరాజ్, తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖైదీ’తో ఆరంభించి, ‘విక్రమ్’తో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎల్సీయూ (Lokesh Cinematic Universe) పై ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.
Also Read : Mission Impossible : హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
లోకేష్ చెప్పినట్టు, విక్రమ్ కథను రచించే సమయంలో కోవిడ్ కారణంగా కొన్ని రోజులు రాజ్ కమల్ ఫిల్మ్స్ కార్యాలయంలోనే గడిపారు. అప్పటికే ఆయన రాసిన స్క్రిప్ట్‌లో ఒక కీలక పాత్ర ఉండేది. అది చూసిన వెంటనే ఆ పాత్ర ‘ఖైదీ’లోని ఇన్స్పెక్టర్ బిజోయ్ పాత్రను గుర్తుకు తెచ్చిందట. వెంటనే కొత్త పాత్ర సృష్టించే బదులు, అదే బిజోయ్ పాత్రను విక్రమ్‌లో కొనసాగించాలని భావించారు. అదే సమయంలో ఒక నూతన ఆలోచన మొదలైంది “ఎందుకు ఓ ప్రత్యేక యూనివర్స్ ప్రారంభించకూడదు?” అని..
అలా ‘ఖైదీ’లోని కొన్ని కీలక పాత్రలను విక్రమ్లోకి తీసుకురావడం, కథలో మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం, బిడ్డల పట్ల ఉన్న ఎమోషనల్ కనెక్ట్ వంటి అంశాలను కలపడం జరిగిందని వెల్లడించారు. ఈ ఐడియా కమల్ హాసన్‌కి వినిపించగా, ఆయన కూడా ఓప్పుకున్నారు అని లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలు ఈ ఎల్సీయూ లో భాగంగా తెరకెక్కగా, ‘కూలీ’ కూడా ఇదే యూనివర్స్‌లో భాగమేనా అన్న దానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!