Site icon NTV Telugu

Lokesh : ‘ఎల్‌సీయూ’ ఆ ఒక్క ఆలోచనతో మొదలైంది – లోకేష్ ఓపెన్ టాక్!

Lokesh

Lokesh

తమిళ సినిమా పరిశ్రమను ఓ కొత్త దిశగా నడిపిస్తున్న ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనకరాజ్, తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖైదీ’తో ఆరంభించి, ‘విక్రమ్’తో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎల్‌సీయూ (Lokesh Cinematic Universe) పై ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.

Also Read : Mission Impossible : హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

లోకేష్ చెప్పినట్టు, విక్రమ్ కథను రచించే సమయంలో కోవిడ్ కారణంగా కొన్ని రోజులు రాజ్ కమల్ ఫిల్మ్స్ కార్యాలయంలోనే గడిపారు. అప్పటికే ఆయన రాసిన స్క్రిప్ట్‌లో ఒక కీలక పాత్ర ఉండేది. అది చూసిన వెంటనే ఆ పాత్ర ‘ఖైదీ’లోని ఇన్‌స్పెక్టర్ బిజోయ్ పాత్రను గుర్తుకు తెచ్చిందట. వెంటనే కొత్త పాత్ర సృష్టించే బదులు, అదే బిజోయ్ పాత్రను విక్రమ్‌లో కొనసాగించాలని భావించారు. అదే సమయంలో ఒక నూతన ఆలోచన మొదలైంది “ఎందుకు ఓ ప్రత్యేక యూనివర్స్ ప్రారంభించకూడదు?” అని..

అలా ‘ఖైదీ’లోని కొన్ని కీలక పాత్రలను విక్రమ్‌లోకి తీసుకురావడం, కథలో మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం, బిడ్డల పట్ల ఉన్న ఎమోషనల్ కనెక్ట్ వంటి అంశాలను కలపడం జరిగిందని వెల్లడించారు. ఈ ఐడియా కమల్ హాసన్‌కి వినిపించగా, ఆయన కూడా ఓప్పుకున్నారు అని లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలు ఈ ఎల్‌సీయూ లో భాగంగా తెరకెక్కగా, ‘కూలీ’ కూడా ఇదే యూనివర్స్‌లో భాగమేనా అన్న దానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Exit mobile version