NTV Telugu Site icon

Lokesh Kanagaraj : ఈ సారైనా హిట్టు దక్కేనా..?

Lokesh

Lokesh

లోకేశ్ కనగరాజ్ సినిమాలంటే యూత్‌లో ఫుల్ క్రేజ్. యాక్షన్ డ్రామా, వయలెంట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లోకీ. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ వరల్డ్ క్రియేట్ చేసి ఇన్‌స్టాల్‌మెంట్స్ సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు. తన సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి  ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ నడిచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రజెంట్.. తన బౌండరీ దాటి ఔట్ ఆఫ్ LCUలో రజనీతో కూలీ చేస్తున్నాడు.
Also Read : Tollywood : భారత దేశ చలన చిత్ర పరిశ్రమ లో ఆంధ్రప్రదేశ్ నం- 1

ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు లోకేశ్. వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లే కనిపిస్తుంది ఈ స్టార్ కాస్ట్ చూస్తుంటే. రజనీకాంత్ కూలీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, మంజుమ్మల్ బాయ్స్ ఫేం సౌబిన్, అమీర్ ఖాన్, సందీప్ కిషన్ వంటి  స్టార్ హీరోలను ఇన్ బిల్ట్ చేసి పెద్ద స్కెచ్చే ప్లాన్ చేశాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రిస్క్ చేస్తున్నాడు లోకి. అయితే డైరెక్టర్‌గా కాదు నిర్మాతగా. ఇప్పటికే మైఖేల్‌తో ప్రజెంటర్‌గా డిజాస్టర్ చూసిన లోకేశ్ జీ స్క్వార్డ్ వెంచర్ క్రియేట్ చేసి ఫైట్ క్లబ్ తీస్తే అదీ సేమ్ టు సేమ్ మైఖేల్ రిజల్ట్ ఇచ్చింది. అయినా సరే డేర్ చేస్తూ రాఘవ లారెన్స్‌తో బెంజ్ ఎనౌన్స్ చేయగా ఇప్పుడు మరో మూవీకి ప్రొడ్యూసర్‌గా ఛేంజ్ అయ్యాడు. మిస్టర్ భారత్ అనే మూవీని పట్టాలెక్కించాడు. రీసెంట్లీ ప్రోమో రిలీజ్ చేశారు. ఇది ఫన్ మూవీలా కనిపిస్తోంది. ఇటు డైరెక్టర్‌గా, అటు ప్రొడ్యూసర్‌గా లోకీ కమిట్ మెంట్ చూస్తుంటే ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలన్నా ఆలోచనలో ఉన్నట్లున్నాడు. మరీ ఈ సారైనా నిర్మాతగా హిట్టు అందుకుంటాడో లేదో.

Show comments