దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. అయితే ఇటీవల రజనీకాంత్ హీరోగా లోకేష్ చేసిన ‘కూలీ’ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే, తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించగా అది వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన ‘ఖైదీ 2’ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read :SSMB : సముద్రంలో సొరచేపలా సూపర్ స్టార్ మహేశ్ బాబు విన్యాసాలు
అయితే ఇప్పుడు అనుకోకుండా తమిళ మీడియా సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. కమల్ హాసన్, రజినీకాంత్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది కాబట్టే, ఆ కథతో తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ హీరోలుగా సినిమా చేయబోతున్నారనే ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి తెలుగు ఫ్యాన్స్ మొట్టమొదటిసారి ఈ విషయం చూసి ఆశ్చర్యపోయినా, తర్వాత ప్రస్తుతానికైతే ఇది నిజం కాదు అనే విషయం ఈజీగానే అర్థం చేసుకున్నారు. నిజానికి ఇదంతా తమిళ మీడియా ప్రచారమే. ఈ మేరకు లోకేష్ కనకరాజు ఆలోచన అయినా చేశాడో లేదో తెలియదు కానీ, తమిళ మీడియా క్రియేషన్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. నిజంగా ఒకవేళ ఈ ప్రాజెక్టు సెట్ అయితే మాత్రం బాక్సులు బద్దలైపోతాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ కలిసి సినిమా చేస్తే అది ఏ రేంజ్ బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతుందో ఊహించడమే కష్టం అని చెప్పొచ్చు.
