‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lokesh Kanagaraj: డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డీసీ’. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా.. సమాజంలోని డార్క్ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్, మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల చుట్టూ తిరుగుతుంది. లోకేష్ కనగరాజ్ తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో లోకేష్ యాక్టింగ్‌పై కూడా ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర కోసం లోకేష్ ఎంత కష్టపడ్డారో చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని పూర్తిగా మార్చుకునేందుకు ఆయన ప్రత్యేకంగా లోయర్ బాడీ వర్కౌట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నారని సమాచారం.
అయితే షూటింగ్ సమయంలో లోకేష్‌కు అనుకోని ప్రమాదం ఎదురైందట. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో షోల్డర్ డిస్లోకేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా ఇబ్బందులు ఎదురైనా.. పాత్రపై ఉన్న అంకితభావంతో షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. దర్శకుడిగా తన సినిమాల్లో యాక్షన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే లోకేష్.. నటుడిగా కూడా పాత్ర కోసం ఇంతగా శ్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గాయాన్ని సైతం లెక్కచేయకుండా సినిమాను పూర్తి చేయడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌కు సంబంధించిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆయన కమిట్మెంట్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
పాత్ర కోసం కష్టపడి.. లొకేషన్లో గాయపడిన లోకేష్ కనగరాజ్!
దర్శకుడిగా సంచలనాలు సృష్టించే లోకేష్ కనగరాజ్, 'DC' చిత్రంలో ఒక విలక్షణమైన పాత్ర ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాత్ర కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలిపే ఒక వీడియో బయటికి… pic.twitter.com/PD88W6vc87
— Journalist Yagna (@yagnamurthy) August 22, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?