Site icon NTV Telugu

Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్

Dc

Dc

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్.. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పడు దర్శకునిగా ఖైదీ 2, రజనీ – కమల్ కంబోలో సినిమా చేయాల్సి ఉన్న కూడా డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చిచి హీరోగా ఎంట్రీ ఇస్తునందు. డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందేమో హీరోగా టర్న్ అయ్యాడు.  ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా వస్తోంది.

ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అలాగే గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో నటిస్తున్నాడు లోకేష్. ఇక బాలీవుడ్ భామ వామిక గబ్బి చందాన పాత్రలో కనిపించబోతుంది. రెండిటిలో మొదటి రెండు లెటర్స్ తో ఈ సినిమాకు ‘DC’ అనే టైటిల్ కు ఫిక్స్ చేసారు. అవుట్ అండ్ అవుట్ రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్టు గ్లిమ్స్ చూస్తే అర్ధం అవుతోంది. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ భామ రచిత రామ్, తమిళ్ బ్యూటీ మిర్న మీనన్ మరో రెండు పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అనిరుధ్ ఈ DC సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడిగా తమిళ అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.

Also Read : SSMB 29 : రాజమౌళి – మహేశ్ సినిమా టైటిల్ ఫిక్స్ అండ్ లాక్

Exit mobile version