ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ, వేర్, వై… ఎవరు, ఎక్కడ, ఎందుకు’ అనేది టైటిల్ అర్థం. ప్రియదర్శి, వివా హర్ష, సత్యం రాజేష్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తుండగా… కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ గింప్స్ ను విడుదల చేసి మూవీ లవర్స్ లో ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ గింప్స్ విడువులైనప్పటి నుంచీ ఫుల్ సాంగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘లాక్ డౌన్’ ఫుల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. రోల్ రైడ ఈ ర్యాప్ సాంగ్ ను ఆలపించగా, సైమన్ కే కింగ్ సంగీతం సమకూర్చారు. అందరినీ ఆకట్టుకుంటున్న ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ను మీరు కూడా వీక్షించండి.