స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో కెరీర్ స్టార్ట్ చేసింది అనన్య పాండే. ఆ సినిమా సూపర్ హిట్ కాదు కానీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె హిట్ చూసి రెండేళ్లు అవుతోంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అప్పీరియన్స్‌లకు పరిమితమైన అనన్య రూట్ ఛేంజ్ చేసి థియేట్రికల్ మూవీస్‌పై ఫోకస్ చేస్తోంది.
Also Read : Exclusive : ఘట్టమనేని జయకృష్ణ – అజయ్ భూపతి టైటిల్ ఇదే
ఈ ఏడాది జలియన్ వాలా భాగ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన కేసరి చాప్టర్ 2తో టూ ఇయర్స్ తర్వాత ధియేటర్ ప్రేక్షకులను పలకరించింది అనన్య. కానీ సినిమా అండర్ ఫెర్మామెన్స్ చేయడంతో ఈ ఏడాది ఆమె వచ్చిన సంగతే ఆడియెన్స్‌కి తెలియలేదు. కానీ ఇయర్ ఎండింగ్ లో తానేంటో ఫ్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. తు మేరీ మై తేరా మై తేరా తూ మేరీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న తు మేరీ మై తేరా మై తేరా తూ మేరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సమీర్. 2026లో రిలీజ్ చేయాలని భావించగా రీసెంట్‌గా డిసెంబర్ 25కి ప్రీ పోన్ చేసుకుంది. ఈ ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చిన కజిన్ అహన్ పాండే సైయారాతో ఊహించని హిట్టు అందుకున్నట్లే అనన్య కూడా ఎక్స్‌పెక్ట్ చేయని సక్సెస్ కొట్టి రేస్ లో దూసుకెళ్లాలని భావిస్తోంది.
