Site icon NTV Telugu

Lenin : ఎవరూ ఊహించని రీతిలో అఖిల్‌ పాత్ర ..

Akhil Lenin

Akhil Lenin

అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్‌ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవబోతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తన ప్రతిభను గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. అయితే తాజాగా అఖిల్‌ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతున్నాయి.

Also Read : Prabhas : ‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?

ఎంటీ అంటే ఈ మూవీలో అఖిల్‌ పాత్ర నేపథ్యం ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందట. ఎందుకంటే ఇందులో హీరో పేరు లెనిన్‌ ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్ట్‌ నాయకుడి పేరు అది. ఆ పేరుకూ, అతని ఆహార్యానికి పొంతన లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకూ కమ్యూనిజానికి పొత్తు కుదరదు. అలాంటిది నుదుటన బొట్టు.. పెరిగిన గడ్డం.. దేవుడి బొమ్మతో మెడలో వేళ్ళాడే గొలుసు. ఇలా విభిన్నంగా అఖిల్‌ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అంటే అతని అవతారాన్ని, పేరుకీ, సినిమా కథకూ ఊహించని సంబంధం ఉంటుందని తెలుస్తోంది. అంటే అఖిల్‌ కెరీర్‌లోనే నెవర్‌ బిఫోర్‌ అనిపించేలా క్యారెక్టరైజేషన్‌ ఉండబోతుంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version