ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్న స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్ తో రవితేజ వరుస చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకముందే రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కునున్న ప్రాజెక్ట్ షూటింగ్ కు రెడీ అయిపోయారట. ప్రస్తుతం రవితేజ దర్శకుడు శరత్ మాండవతో కలిసి తన రాబోయే చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా షూటింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఈ మూవీ షూటింగ్ జూలై 1 నుండి ప్రారంభమవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం.
Read Also : కోలీవుడ్ స్టార్ హీరోతో తమన్నా… వంట ప్రోగ్రాం కోసం…!!
ముందుగా ఈ షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో యూరప్‌లో ఖిలాడి తుది షెడ్యూల్‌ను చిత్రీకరించడం కన్నా ఇక్కడే బెటర్ అని నిర్ణయించుకున్నారట. సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే ఈ థ్రిల్లర్‌లో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ రొమాన్స్ చేయనున్నారు. తాజాగా మాస్ మహారాజ న్యూ పిక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ లో వైట్ షర్ట్ ధరించిన రవితేజ బాల్కనీ లోంచి బయటకు చూస్తూ కన్పిస్తున్నారు.