యాడ్స్ చేయదు. ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు ఇవి నయన్ తార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లయింట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటోంది. యాడ్స్ మాత్రమే కాదు. సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఆ మధ్య జరిగిన మూకుత్తి అమ్మన్ – 2 ఓపెనింగ్ సెర్మనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ.
Also Read : TheyCallHimOG : బెజవాడలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన OG
మూకుత్తి అమ్మన్ 2 అంటే నయన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి లాంచ్ ఈవెంట్లో పాల్గొంది అనుకుంటే మెగాస్టార్- అనిల్ రావిపూడి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారులో తన ఎంట్రీకి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది మేడమ్. ఇలా తనపై ఉన్న నెగిటివిటీని మెల్లిగా చెరిపేసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం వింతే. సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెకండ్ సింగిల్ నయన్ డిజిటల్ లాంచ్ చేసింది. యాడ్స్, ఇంటర్వ్యూస్, ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం చూస్తుంటే నయన్ తారకు జ్ఞానోదయం అయినట్లే కనిపిస్తోంది. విఘ్నేశ్ శివన్‌తో లైఫ్ స్టార్ట్ చేశాక ఆమెకు ఫిల్మ్ మేకర్ల కష్టాలు తెలిసినట్లున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల టైంలో మీడియా ముందుకు వస్తోంది మేడమ్. మొత్తానికి ఇది మంచి పరిణామమే ఇక నయన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో సందడి చేయడమే తరువాయి. గతంలో సైరా నరసింమా రెడ్డి ప్రమోషన్లలో భాగంగా నయన్ ఈవెంట్స్‌కు రాదు అని ఇన్ డైరెక్టుగా చెప్పిన చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారూలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోన్న ఈ భామ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసేఅవకాశం ఉంది.
